Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి మంగళవారం ఉదయాన్నే గట్టి షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో జరిగిన మార్పుల వల్ల దేశీయంగా బంగారం ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. నిన్నటి వరకు రేట్లు తగ్గుతుండటంతో సంతోషపడిన కొనుగోలుదారులకు ఈరోజు పెరిగిన ధరలు చేదువార్తగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఇంకా పెరుగుతాయా లేదా మళ్లీ తగ్గుముఖం పడతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దేశవ్యాప్తంగా చూసుకుంటే కేవలం ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 కి చేరింది. నిన్నటితో పోలిస్తే దీనిపై ఒకేసారి రూ.1,470 పెరిగింది. అలాగే, సాధారణంగా ఎక్కువ మంది కొనుగోలు చేసే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,40,400 వద్ద పలుకుతోంది. నిన్నటి మీద దీని ధర రూ.1,350 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో రేట్లు ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,53,310 గాను, 22 క్యారెట్ల ధర రూ.1,40,550 గాను నమోదైంది.
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,400 వద్ద కొనసాగుతోంది. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర (ముంబై) లలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. అయితే తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం బంగారం ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,54,910 కి చేరగా, 22 క్యారెట్ల రేటు రూ.1,42,000 మార్కును తాకింది.
బంగారం ధరలు ఇలా భారీగా పెరిగినప్పటికీ, వెండి ప్రియులకు మాత్రం కాస్త ఊరట లభించింది. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద విక్రయమవుతోంది. బెంగళూరులో మాత్రం వెండి ధర కాస్త తక్కువగా ఉంది, అక్కడ కిలో వెండి రూ.2,60,000 పలుకుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనార్హం.
