Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతూ పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. కేవలం 4 గంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మార్పుల వల్ల మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న తాజా రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్లో ఈరోజు ఉదయం 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,720 గా ఉండేది. కానీ, కేవలం నాలుగు గంటల్లోనే ఏకంగా రూ.1,040 తగ్గి, ప్రస్తుతం రూ.1,51,690 కి చేరుకుంది. అలాగే సాధారణంగా మనం కొనే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,050 వద్ద, 18 క్యారట్ల ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంతో పాటు ముంబై, బెంగళూరు, పూణే, కేరళలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై నగరాల్లో ధరలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1,51,840 గా ఉండగా, 22 క్యారట్ల ధర రూ.1,39,200 గా ఉంది. అదేవిధంగా చెన్నైలో రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారట్ల బంగారం రూ.1,53,490 పలుకుతుండగా, 22 క్యారట్ల ధర రూ.1,40,700 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటే వెండి కూడా భారీగా తగ్గింది. దేశీయ మార్కెట్లో ఉదయం కేజీ వెండి ధర రూ.2,69,900 ఉండగా, నాలుగు గంటల వ్యవధిలోనే ఏకంగా రూ.10,000 తగ్గి రూ.2,60,000 కి చేరుకుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం కేజీ వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో ఈ ధరలు దిగివచ్చాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే, మళ్లీ అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సూచనలు కనిపిస్తున్నందున, రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందుకే బంగారం కొనాలనే ఆలోచన ఉన్నవారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, అయితే ఒకసారి మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
