Gold Price Today: మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి, వెండికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పసిడి కొనుగోలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నా, లేకపోయినా ధరలతో సంబంధం లేకుండా జనాలు ఎప్పుడూ జ్యువెలరీ షాపుల్లో కనిపిస్తూనే ఉంటారు. అయితే, గత కొన్ని రోజులుగా మారుతున్న మార్కెట్ పరిస్థితుల వల్ల బంగారం ధరలు ప్రతిరోజూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
తాజాగా జూన్ 1వ తేదీన పసిడి ప్రేమికులకు కాస్త ఊరట లభించింది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశంలో తులం బంగారం ధర రూ. 1,57,030 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు కింద చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఈరోజు దేశంలోని ముఖ్య నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల ధరలు ఇలా ఉన్నాయి:
* హైదరాబాద్: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 గా ఉంది.
* విజయవాడ: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 వద్ద ట్రేడవుతోంది.
* ఢిల్లీ: దేశ రాజధానిలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. 24 క్యారెట్ల ధర రూ. 1,57,180 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,44,090 గా నమోదైంది.
* ముంబై: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 ఉంది.
* బెంగళూరు: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 ఉంది.
* కోల్‌కతా: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 గా కొనసాగుతోంది.
* కేరళ: 24 క్యారెట్ల ధర రూ. 1,57,030 కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,43,940 ఉంది.
కిలో వెండి ధరలు:
బంగారంతో పాటే వెండి ధరలు కూడా ఈరోజు కాస్త తగ్గాయి. అయితే నగరాలను బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది.
* తెలుగు రాష్ట్రాలు & దక్షిణాది: హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ. 2,89,900 వద్ద కొనసాగుతోంది.
* ఇతర ప్రధాన నగరాలు: ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,79,900 వద్ద ట్రేడవుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు కేవలం మార్కెట్ సమాచారం ప్రకారం ఇచ్చినవి మాత్రమే. వీటిపై జీఎస్టీ (GST), మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ స్థానిక జ్యువెలరీ దుకాణంలో ధరలను సరిచూసుకోవడం మంచిది.
