Viral News: మనం చూస్తూనే ఉంటాం ప్రతి రోజు ట్రైన్ లలో వందల మంది ప్రయాణిస్తుంటారు. టికెట్ తీసుకోని వెంటనే సీట్ కోసం యువకులు పరుగులు తీస్తుంటారు. సీట్ దొరికితే పక్కన వృద్ధులు ఉన్నా వారిని చూసి చూడనట్లే ఉంటారు, ఎక్కడ చూస్తే వారికి సీట్ ఇవ్వాల్సి వస్తుందోనని.. ఇలాంటి ఘటనలు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.
రైల్వే పోలీస్ ఆఫీసర్‌కి సెల్యూట్
సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. జనరల్ బోగీలో ఓ వృద్ధుడు నించొని ఉండటం అటువైపు వెళ్తున్న రైల్వే పోలీస్ ఆఫీసర్ చూడటంతో, అక్కడికి వచ్చిన ఆయన ఆయనకి సీట్ ఇప్పించారు. అక్కడ ఉన్న ప్రయాణికులకు మీకు కొంతైనా మానవత్వం లేకపోతే ఎలా.. ఓ వృద్ధుడు నించొని ఉండడం చూసి కూడా అలాగే ఉండడాన్ని తప్పు పట్టారు.
మీరు కూడా ఏదో ఒకరోజు ముసలోళ్లు అవుతారు.. దాని గురించి మీరు పట్టించుకోకపోయినా, మీరు వృద్ధులకు సీట్లు ఇస్తే మీ అమ్మ నాన్నకి వేరే వారు సీట్లు ఇస్తారు. ఇలాంటి పనులకి కూడా పోలీసులే రావాల్సిన అవసరం లేదు, కొంత మానవత్వం ఉంటే చాలు అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ రైల్వే పోలీస్ ఆఫీసర్‌కి సెల్యూట్
రద్దీగా ఉన్న ట్రైన్‌లో ఓ వృద్ధుడు నిలబడి ఉంటే.. ఆయనకు సీటు ఇవ్వకుండా దర్జాగా కూర్చున్న వ్యక్తులు
సరిగ్గా నిలబడటానికి చేత కాక ఆయన ఇబ్బంది పడుతున్నా.. చూసీ చూడనట్టుగా వ్యవహరించిన వైనం
అదే టైంలో అక్కడికి వచ్చి.. వాళ్లను పక్కకు జరిపి, వృద్ధుడికి… pic.twitter.com/DNoo1GvJiP
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 27, 2026
