Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి వార్త. గత నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. తాజాగా ఈరోజు కూడా ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,920 గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమేనని, మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ఇవి పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చని గమనించాలి.
మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,920 గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,840 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో కూడా సరిగ్గా ఇవే ధరలు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు చెన్నైలో ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,070 గా, 22 క్యారెట్ల ధర రూ.1,43,990 గా ఉంది. ఇక అన్ని నగరాల కంటే చెన్నైలో పసిడి ధరలు ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,60,090 పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,47,490 వద్ద కొనసాగుతోంది.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా దిగివచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో ప్రాంతాల వారీగా తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై, కేరళ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,89,900 గా ఉంది. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం కిలో వెండి ధర కొద్దిగా తక్కువగా అంటే రూ.2,79,900 వద్ద విక్రయించబడుతోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
