Peddi: 

Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!

Peddi: ఇండియాలోనే పెద్ద బ్యానర్లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది. రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘పెద్ది’ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేసింది.

కేజీఎఫ్, కాంతారా, సాలార్ వంటి భారీ సినిమాలు నిర్మిస్తూనే ఇంకో పక్క ‘మహా అవతార్ నరసింహ’ లాంటి యానిమేషన్ సినిమాలు కూడా నిర్మిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించిన ఈ సంస్థ మొట్టమొదటిసారిగా ‘పెద్ది’ సినిమాతో ఓవర్సీస్‌ మార్కెట్ లోకి అడుగుపెడుతోంది.

‘పెద్ది’కి ప్లస్ కానున్న హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ రిలీజ్.. ఎందుకంటే అమెరికా, యూరప్, ఇంకా గల్ఫ్ వంటి కీలక అంతర్జాతీయ ప్రాంతాలలో ఈ చిత్రం మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక ‘పెద్ది’ గురించి వస్తే..!

బుచ్చి బాబు సానా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. మే 18 నాడు ముంబైలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ని విడుదల చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. తర్వాత మే 23న భోపాల్‌లో సాంగ్ రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ ఈవెంట్‌కి మూవీ టీమ్ మొత్తం రానున్నట్టు తెలుస్తోంది.peddi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *