Delhi Crime News: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. ఒకవైపు ప్రైవేట్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడగా, మరోవైపు మూడేళ్ల చిన్నారిపై పాఠశాలలోనే లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన రాజధానిలో వరుస నేరాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. వెస్ట్ ఢిల్లీలోని నంగ్లోయ్ ప్రాంతంలో మే 12న ఒక మహిళపై జరిగిన అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ స్లీపర్ బస్సులో ప్రయాణిస్తున్న సదరు మహిళపై ఆ బస్సు డ్రైవర్ ఇంకా కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అరెస్టు చేయడమే కాకుండా నేరానికి వాడిన బస్సును కూడా సీజ్ చేశారు.
పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి: రాజ్ నివాస్ వద్ద ఉద్రిక్తత
మరోవైపు జనక్పురిలోని ఒక పాఠశాలలో మూడేళ్ల పసికందుపై జరిగిన లైంగిక దాడి ఘటన రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. బాధితురాలి తల్లిదండ్రులను పోలీసు అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
బీజేపీ పాపపు ఘటం నిండిపోయింది: కేజ్రీవాల్
ఈ అరెస్టులను మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, మూడేళ్ల చిన్నారిపై హేయమైన నేరం జరిగితే, నిందితులను రక్షించడానికి అందరూ ఏకమవుతున్నారని ఆరోపించారు. న్యాయం కోరిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం అన్యాయమని, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబం కోసం సౌరభ్ భరద్వాజ్ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న పాపాలు పండాయని, త్వరలోనే వారు తమ తప్పుడు పనుల ఫలితాన్ని అనుభవిస్తారని కేజ్రీవాల్ హెచ్చరించారు.
