Actress Trisha: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ (TVK) పార్టీ విజయంతో ఆ రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా, మ్యాజిక్ ఫిగర్‌కు అత్యంత చేరువలో ఉంది. సరిగ్గా ఇదే తరుణంలో కోలీవుడ్ అందాల నటి త్రిష తన 44వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం. ఈ రెండు శుభపరిణామాలు ఒకే రోజు రావడంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తన పుట్టినరోజు సందర్భంగా త్రిష ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆమె నేరుగా విజయ్ ఇంటికి చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలోనే విజయ్ పార్టీకి త్రిష తన పూర్తి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన పుట్టినరోజు నాడే విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఆమె ఆయన్ని స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్-త్రిషల బంధంపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. విజయ్ అధికారంలోకి వస్తే త్రిష ఒక కీలక శక్తిగా మారుతారని ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా విజయ్ విజయభేరి మోగించడం, అదే సమయంలో త్రిష పుట్టినరోజు వేడుకలు జరగడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం నెట్టింట ‘విజయ్-త్రిష’ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఊహించని రీతిలో విజయ్ తమిళ రాజకీయాల్లో పాగా వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
#WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan arrives at the residence of TVK chief Vijay, in Chennai.
TVK is currently leading in 106 seats of the total 234 in the state. pic.twitter.com/Sezg1xgYDQ
— ANI (@ANI) May 4, 2026
