Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట మార్చారని, గతంలో కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ఒక్కరిపై కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అటు కేసీఆర్ కుటుంబానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాడుతున్న భాషను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో జరిగిన రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ కేంద్రానికి రేవంత్ రాసిన లేఖలో అసలు ఏముందో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
