Illegal Affair

Illegal Affair: ప్రియుడితో సుఖం కోసం కొడుకే అడ్డా? కళ్లలో కారం కొట్టి, గొంతు నులిమి చంపిన ఉదంతం!

Illegal Affair: సమాజంలో పెరుగుతున్న అక్రమ సంబంధాల వల్ల రోజుకో హత్య లేదా అరెస్ట్ చూడాల్సి వస్తుంది. ఈ సంబంధాలకి భర్త, భార్య మాత్రమే చనిపోవడమే కాకుండా.. అడ్డుగా ఉన్నారంటూ అబ్బం శుబ్బం తెలియని పిల్లలని కూడా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తమ సంబంధానికి 5 ఏళ్ల కుమారుడు అడ్డుకావొద్దని ఘోరంగా చంపేసిన కసాయి తల్లి.

కామారెడ్డి జిల్లాలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. విభేదాల కారణంగా భర్తతో విడిపోయిన లక్ష్మి, తన 5 ఏళ్ల కొడుకుతో ఉంటుంది. భర్తతో విడిపోయిన తర్వాత లక్ష్మికి నరసింహులు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త అక్రమ సంబంధంగా మారింది. గత ఆరు నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఎక్కడ తమ ఆనందానికి అడ్డొస్తాడేమో అని అనుమానంతో బాబుని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న తల్లి.. పిల్లోడని కూడా చూడకుండా కళ్లల్లో కారం కొట్టి, ఆ తర్వాత గొంతు నులిమి, కర్రతో తలపైన కొట్టి, నేలకేసి కొట్టి హత్య చేసింది కన్న తల్లి.. కాదు కాదు కసాయి తల్లి. విషయం తెలియడంతో లక్ష్మి మరియు నరసింహులులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పిల్లోడిని చంపిన విధానాన్ని చూసిన తర్వాత ఆమె అసలు మనిషేనా అనే డౌటే వస్తుంది. ఈ పసిపిల్లాడికి ఏంతెలుసని అంత క్రూరంగా ఎందుకు చంపడం? భర్తపైన కోపంతోనే ఇంత క్రూరంగా హత్య చేసిందా..? లేక ఆమెలో ఉన్న సైకోని బయటికి తీసిందా? ఆమె సుఖం కోసం ఒక నిండు ప్రాణం తీయడం ఎంతవరకు న్యాయం?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *