Viral News

Viral News: జామకాయలు కోసిందని చిన్నారి చేతులు కట్టేసి చిత్రహింసలు!

Viral News: జవాన్ అంటే తెలియకుండానే గౌరవం ఇస్తారు. బోర్డర్‌లో మన కోసం ప్రాణాలు సైతం ఇస్తారు అనే ఆలోచనతో ఉంటారు జనాలు.. కానీ ఓ మాజీ జవాన్ చేసిన పని చూసి అందరూ అతడిని శిక్షించాలని అంటున్నారు. చిన్న పిల్లల్ని కూడా చూడకుండా, జామకాయ దొంగతనం చేసిందనే కారణంతో ఆ చిన్నారిని శిక్షించాడు.. ఏడుస్తున్నా కరుణించని జవాన్.

ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో జరిగింది. మాజీ జవాన్ ఇంట్లో ఉన్న జామకాయ చెట్టుకి ఉన్న జామకాయలని ఓ చిన్నారి తీసుకుని తిన్నది. అది చూసిన జవాన్ వెంటనే చిన్నారిని కొట్టడమే కాకుండా, పక్కనే ఉన్న మెట్ల రేలింగ్‌కు చేతులు కట్టేశాడు. చిన్నారి ఎంత ఏడ్చినా వినిపించనట్టు ప్రవర్తించాడు. చిన్నారి అరుపులు వినిపించడంతో స్థానికులు ప్రశ్నించగా, “చేసిన తప్పుకి శిక్ష తప్పదు” అంటూ బదులిచ్చాడు. ఈ మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక జవాన్‌గా పనిచేసి ఇలాంటి పనులు చేయడం ఏంటని తిడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *