Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియలో భాగంగా నేడు రాజ్యసభలో చారిత్రాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎగువ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు, దీనిపై ప్రస్తుతం సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభలోనూ గ్రీన్ సిగ్నల్ లభిస్తే, అమరావతి రాజధానిగా చట్టపరమైన పటిష్టతను సంతరించుకోనుంది. గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, పార్లమెంట్ సాక్షిగా అమరావతికి గుర్తింపునివ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
