DC vs LSG

DC vs LSG: ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం.. రిజ్వీ, స్టబ్స్ మెరుపులతో లక్నోకు షాక్!

DC vs LSG: ఐపీఎల్ 2026 సీజన్‌లో నిన్న జరిగిన ఐదవ ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో సూపర్ జెయింట్స్  142 పరుగుల టార్గెట్ పెట్టగా  ఇ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 17.1 ఓవర్లలోనే ఛేదించి, 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒక దశలో 26 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీని, యువ ఆటగాడు సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ తమ భాగస్వామ్యంతో విజయ తీరాలకు చేర్చారు.

తడబడిన లక్నో బ్యాటర్లు

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ బౌలర్ల ధాటికి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టాప్ స్కోరర్లు: అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) మినహా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

బౌలింగ్ ప్రదర్శన: ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి (3 వికెట్లు), టి. నటరాజన్ (3 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతో రాణించగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

రిజ్వీ – స్టబ్స్ రక్షక మంత్రం

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా, నితీష్ రాణా (15), కెప్టెన్ అక్షర్ పటేల్ (0) నిరాశపరిచారు. 4.3 ఓవర్లలో 26 పరుగులకే 4 వికెట్లు పడిపోవడంతో ఢిల్లీ ఓటమి అంచున నిలిచింది.

ఈ దశలో ‘ఇంపాక్ట్ సబ్’గా వచ్చిన సమీర్ రిజ్వీ తన సత్తా చాటాడు. స్టబ్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 119 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

  1. సమీర్ రిజ్వీ: 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి 70 పరుగులు చేశాడు.

  2. ట్రిస్టన్ స్టబ్స్: 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 పరుగులు చేసి రిజ్వీకి చక్కని సహకారం అందించాడు. ఈ జోడీ మెరుపులతో ఢిల్లీ మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

లక్నో బౌలింగ్ వైఫల్యం

లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీసినప్పటికీ, మిగిలిన బౌలర్లు రిజ్వీ-స్టబ్స్ జోడీని అడ్డుకోలేకపోయారు. మొహమ్మద్ షమీ, మోషిన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లో విఫలమైన లక్నో జట్టు, బౌలింగ్‌లోనూ కీలక సమయంలో వికెట్లు తీయలేక మూల్యం చెల్లించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *