Ram charan

Ram Charan: రామ్ చరణ్ నోటి నుండి పెద్ది రిలీజ్ డేట్..!ఎప్పుడంటే..?..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ విడుదల తేదీపై వస్తున్న వార్తలకి  రామ్ చరణ్ తెరదించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా జూన్ 26కు నెలకు వాయిదా పడిందంటూ వస్తున్న వార్తలపై రామ్ చరణ్ స్వయంగా స్పందించారు. తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న అయన మూవీ టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ, ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకా విడుదల తేదీ పైన వస్తున్న వార్తలపైనా సినిమా పనులు సక్రమంగా జరుగుతున్నాయని, సినిమా లేట్ అవ్వడం లేదని స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

వాయిదా వార్తలకు కారణమేంటి?

ముందుగా ప్రకటించిన ప్రకారం, రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇటీవల ఒక సినీ వేడుకలో నిర్మాత ఎస్కేఎన్ పొరపాటున ఈ సినిమా జూన్ 26న వస్తుందని చెప్పడంతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఇచ్చిన క్లారిటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

చరణ్ మాటల్లో: పెద్ది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులు, యువత ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఆలస్యం కావడం లేదు, ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని చరణ్ పేర్కొన్నారు.

భారీ హంగులతో ‘పెద్ది’

‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు త్రిపాఠి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన అందించిన ట్యూన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

అంచనాలు భారీగా..

రామ్ చరణ్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్‌లో కనిపిస్తారని, ఆయన నటన గత సినిమాలకంటే విభిన్నంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రత్యేక గీతాన్ని కూడా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విడుదల తేదీపై స్పష్టత రావడంతో ‘పెద్ది’ ప్రమోషన్లు త్వరలోనే వేగం పుంజుకోనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *