Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

Tirumala: తిరుమల క్షేత్రం ప్రస్తుతం భక్తులతో కళకళలాడుతోంది. కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం కోసం వేచి ఉన్న వారికి సుమారు 8 గంటల సమయం పడుతోంది.

గడిచిన 24 గంటల్లో స్వామివారిని 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నిన్న 27,241 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా సమకూరింది. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా 5.08 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు రద్దీని గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *