Peddi Birthday Glimpse: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్రం నుండి మేకర్స్ ఈరోజు పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా అగ్రెసివ్ మల్లయోధుడి (పహిల్వాన్) పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.
మల్లయోధుడిగా పవర్‌ఫుల్ డైలాగులు
విడుదలైన గ్లింప్స్‌లో చరణ్ లుక్ ఇంకా డైలాగులు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ‘బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో సావుకి ఎదురెళ్లే ఆట. ఇప్పుడు సెప్పు ఉంటావా పోతావా’ అనే విలన్ డైలాగ్‌తో గ్లిపమ్స్ ప్రారంభం అవుతుంది. ఇందులో చరణ్ మాస్ మేకోవర్‌ను పరిచయం చేసింది. “చూడమ్మే.. ఆటే నా పొగరు” అని ఆయన చెప్పే తీరు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కుస్తీ పోటీలు, అందులో చరణ్ తలపడే తీరు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ పాత్ర కోసం చరణ్ తీసుకున్న శిక్షణ, ఆయన కండలు తిరిగిన శేరీరం గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
క్రికెటర్ నుండి పహిల్వాన్ వరకు
గతంలో విడుదలైన మొదటి టీజర్‌లో చరణ్ క్రికెట్ ప్లేయర్‌గా కనిపించగా, తాజా గ్లింప్స్‌లో మల్లయోధుడిగా కనిపించి తనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. ఒకే సినిమాలో రెండు భిన్నమైన క్రీడల నేపథ్యంలో చరణ్ పాత్ర ఉండబోతోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారీ గదతో చరణ్ చేసిన విన్యాసాలు మేకింగ్ విలువలను చాటిచెబుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
స్టార్ కాస్ట్ మరియు విడుదల తేదీ
ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మాస్ అంశాలు, గ్రామీణ భావోద్వేగాలు కలగలిసిన ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ గ్లింప్స్‌తో సినిమాపై ఉన్న హైప్ మరో స్థాయికి చేరుకుంది.
