KTR

Formula E car Race: ఫార్ములా-ఈ రేస్ కేసులో సంచలనం.. ఏసీబీ చార్జిషీట్‌లో ఏ1గా కేటీఆర్!

Formula E car Race: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫార్ములా-ఈ రేస్ కేసు (Formula E Case) ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) సోమవారం కోర్టులో సమగ్ర చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలపై ఈ చార్జిషీట్ దాఖలైంది.

చార్జిషీట్‌లో నిందితులు వీరే..

ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:

  • A1: కేటీఆర్ (మాజీ పురపాలక శాఖ మంత్రి)

  • A2: అరవింద్ కుమార్ (సీనియర్ ఐఏఎస్ అధికారి)

  • A3: బి.ఎల్.ఎన్ రెడ్డి (హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్)

  • A4: కిరణ్ మల్లేశ్వరరావు (స్పోర్ట్స్ కన్సల్టెంట్)

  • A5: ఫార్ములా ఈ ఆపరేషన్స్ (FEO) సంస్థ (యూకేకు చెందిన సంస్థ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *