Sree Vishnu:

Sree Vishnu: క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న శ్రీ విష్ణు.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

Sree Vishnu:  ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీవిష్ణు తన తర్వాత సినిమాని పట్టాలెక్కించారు. గతంలో తనకు ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి ఆయన మరోసారి జతకట్టారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. వరుస పరాజయాల తర్వాత శ్రీవిష్ణు చేస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘సామజవరగమన’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

శ్రీవిష్ణు గత ఏడాది ‘సింగిల్’ మరియు ఇటీవలే ఫిబ్రవరి 27న విడుదలైన ‘విష్ణు విన్యాసం’ మృత్యుంజయ్, సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా లపైనా ఆడియన్సు లో క్రేజ్ తెచ్చుకున్న రిలీజ్ తరువాత  ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో ఇప్పుడు తన ఆశలన్నీ రామ్ అబ్బరాజు ప్రాజెక్టుపైనే పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించింది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ తోడవ్వడంతో ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూరింది.

ఫుల్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా కొత్త చిత్రం

తాజాగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి వచ్చిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ‘సామజవరగమన’ తరహాలోనే కడుపుబ్బ నవ్వించే డైలాగులు, వినూత్నమైన కథాంశంతో సాగనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. శ్రీవిష్ణు తన మార్కు టైమింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ఆశలన్నీ ఈ సినిమాపైనే..

వరుసగా రెండు సినిమాలు పరాజయం పాలవ్వడంతో, ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ శ్రీవిష్ణు కెరీర్‌కు ఎంతో కీలకంగా మారింది. దర్శకుడు రామ్ అబ్బరాజు తన మార్కు కామెడీ స్క్రిప్ట్‌తో సిద్ధమయ్యారని, ఈ సినిమా కచ్చితంగా శ్రీవిష్ణుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *