Therachaapa

Therachaapa: ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Therachaapa: అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. విడుదల తేది దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

తెరచాప ట్రైలర్ చూస్తుంటే ఆహ్లాదకరమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మొదలై సముద్రతీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలుతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండడం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు అర్థమవుతుంది. డైలాగ్స్ ఇంకా టేకింగ్ చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ సృష్టించే విలేజ్ పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది.

తారాగణం: నవీన్‌రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ హౌస్: అనన్య క్రియేషన్స్
నిర్మాత: కైలాష్ దుర్గం
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్
సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా
ఎడిటింగ్: రాజు బోడసింగి
డైలాగ్స్: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్ కుమార్ సాహిత్యం: మిద్దె మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య
కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్
PRO: మధు VR
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *