Oscar Awards 2026

Oscar Awards 2026: అవార్డ్స్ లో దూసుకుపోయిన ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’.. పాల్ థామస్ ఆండర్సన్‌కు తొలి ఆస్కార్!

Oscar Awards 2026: ప్రపంచ సినిమా లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది.‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Battle After Another)  సినిమా బెస్ట్ పిక్చర్ అవార్డు తో పటు ఇంకా 6 అవార్డ్స్ గెలుచుకొని చెరిత్ర సష్టించింది. ఈ సినిమాలో  లియొనార్డ్ డికాప్రియో ప్రధాన ఫాత్రలో నటించగా పాల్ థామస్ ఆండర్సన్  డైరెక్షన్ చేశారు.

చరిత్ర సృష్టించిన పాల్ థామస్ ఆండర్సన్

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఈ చిత్రంతో తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారు. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించినప్పటికీ, ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి గానూ ఆయన మొదటిసారిగా  ‘ఉత్తమ దర్శకుడు’గా ఆస్కార్‌ను అందుకున్నారు. దర్శకత్వంతో పాటు ఉత్తమ ‘అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే’ విభాగంలోనూ ఆయనే అవార్డు గెలుచుకోవడం విశేషం.

సీన్ పెన్ నటనకు పట్టాభిషేకం

ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో అద్భుత ప్రదర్శన కనబరిచిన సీన్ పెన్ ‘ఉత్తమ సహాయ నటుడు’గా నిలిచారు. ఆయనకు ఇది మూడవ ఆస్కార్ పురస్కారం. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల సీన్ పెన్ ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. ఆయన తరపున ప్రముఖ నటుడు కియారన్ కల్కిన్ వేదికపై అవార్డును అందుకుని, సీన్ పెన్ సందేశాన్ని అభిమానులకు చేరవేశారు.

సాంకేతిక విభాగాల్లోనూ సత్తా

కేవలం నటన, దర్శకత్వమే కాకుండా సాంకేతిక విభాగాల్లోనూ ఈ చిత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆస్కార్ చరిత్రలో ఈ ఏడాదే మొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగంలో కసాండ్రా కులుకుండిస్ అవార్డును గెలుచుకున్నారు. తద్వారా ఈ విభాగంలో మొదటి అవార్డును అందుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. వీటితో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో ఆండీ జుర్గెన్సెన్ అవార్డును దక్కించుకున్నారు.

విజేతల జాబితా (వన్‌ బాటిల్‌ ఆఫ్టర్ అనదర్‌):

  • ఉత్తమ చిత్రం: వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్
  • ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్
  • ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ ఆండర్సన్
  • ఉత్తమ ఎడిటింగ్: ఆండీ జుర్గెన్సెన్
  • ఉత్తమ కాస్టింగ్: కసాండ్రా కులుకుండిస్

మొత్తంగా 13 విభాగాల్లో నామినేషన్లు పొందిన ఈ చిత్రం, ఆరు కీలక అవార్డులతో ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *