Sri Kala Sudha

Sri Kala Sudha: శ్రీ కళా సుధా ఆధ్వర్యంలో 28వ ఉగాది పురస్కారాలు.. ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, కందుల దుర్గేష్

Sri Kala Sudha: చెన్నైలో తెలుగువారి ఘనకీర్తిని చాటుతూ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ 1998వ సంవత్సరం, నవంబర్ 21వ తేదీన ప్రారంభించబడి 27 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పండుగ రోజున ‘మహిళా రత్న’ మరియు ‘బాపు బొమ్మ’, ‘బాపు రమణ’, ‘విశిష్ట’ ఉగాది పురస్కారాలు మరియు సినీ రంగం-2025 పురస్కారాలను మ్యూజిక్ అకాడమిలో మార్చి 15వ తేది 2026 ఆదివారం సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు 2025లో విడుదలైన చలన చిత్రాలలో వివిధ విభాగాలకు సంబంధించిన నటీ నటులను, దర్శక నిర్మాతలను మరియు సాంకేతిక నిపుణులను “ఉగాది పురస్కారము”లతో మరియు వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళామణులకు “మహిళా రత్న పురస్కారము”తో సత్కరించుటకు కమిటి సభ్యులతో చర్చించి నిర్ణయించడమైనది. ఈ కార్యక్రమానికి శ్రీ కళా సుధ సభ్యులతోపాటు తెలుగువారందరూ విచ్చేసి తెలుగువారి ఘనకీర్తిని ఇనుమడింపజేయుచున్నారు.

ఈ సందర్భంగా జరగనున్న ఈ ఉగాది పురస్కారాలకు సంబంధించి వివరాలను చెబుతూ అవార్డు గ్రహీతల పేర్లను, అలాగే జరగనున్న కార్యక్రమ వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారు, బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, ప్రతివాధి భయంకర ఫణీందర్ గారు, వేణు గోపాల్ గారు, అజయ్ కుమార్ గారు, జర్నలిస్ట్ కేశవ గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ ఉగాది పురస్కారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా|| బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, విశిష్ట అతిథిగా ఎంవిఆర్ మురళీ కృష్ణ, గౌరవ అతిధులుగా ఎ.సాయి ప్రసాద్, సాహు గారపాటి, శశికాంత్ వల్లేపల్లి, ముబా పద్మయ్య, రాజమౌళి శీర్ణ, సరోజ వివేకానంద్ రానున్నారు. వశిష్ట ఉగాది పురస్కారం ప్రజా సేవ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ టూరిజం ఇంకా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు అందుకోనున్నారు. అలాగే మహిళా రత్న పురస్కారాన్ని శ్రీమతి మమత మాది రెడ్డి గారు, అందెశ్రీ స్మారక పురస్కారాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, పిబి శ్రీనివాస పురస్కారాన్ని తండ్రిని చిత్రానికి గాను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి అందజేయడం జరుగుతుంది.

అలాగే ఉగాది పురస్కారాలు జాబితాలో ఉత్తమ చిత్రం గా మిరాయ్, ఉత్తమ సంచలన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ జ్యూరీ అవార్డు చిత్రంగా డ్యూడ్, ఉత్తమ నటుడిగా అక్కినేని నాగ చైతన్య, ఉత్తమ నటీమణిగా రష్మిక మందన్న, ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి, ఉత్తమ మాటల రచయితగా మహేష్ బాబు పి, ఉత్తమ ఛాయాగ్రహకుడుగా నికేత్ బొమ్మి, ఉత్తమ ప్రతినాయకుడిగా దీక్షిత్ శెట్టి, ఉత్తమ సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో, ఉత్తమ నూతన దర్శకుడిగా రామ్ జగదీష్, ఉత్తమ నూతన నటుడిగా హర్ష్ రోషన్, ఉత్తమ నూతన హీరోగా కిరీటి రెడ్డి, ఉత్తమ గాయకుడిగా రమణ గోగుల, ఉత్తమ గాయనిగా హరిప్రియ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నూతన నటీమణులుగా ఐశ్వర్య అర్జున్, అనస్వర రాజన్, సాక్షి మడోల్కర్, డైలాగ్స్ & దర్శకుడిగా రాహుల్ రవీంద్ర, ఉత్తమ బాల నటుడిగా బుల్లి రాజు అవార్డులను గెలుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *