AP Rajya Sabha: నేటి రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేల కొడుకులు నేరుగా ఎమ్మెల్యే లేదా ఎంపీ సీట్లు ఆశిస్తారు. కానీ చింతకాయల విజయ్ ఆలోచన వేరు. ఆయనకు పదవుల కంటే కార్యకర్తల ధైర్యం, నమ్మకం ముఖ్యం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు, కార్యకర్తలను భయపెట్టి అణచివేయాలని ప్రయత్నించారు. ఎవరూ ముందుకు రావడానికి సాహసించని క్లిష్ట సమయంలో, విజయ్ తన సొంత తమ్ముడిని వార్డు మెంబర్‌గా పోటీ చేయించారు. ఉన్నత విద్యావంతుడు, పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, “మేము మీతోనే ఉన్నాం, చిన్న పదవైనా సరే కలిసి పోరాడతాం” అని కార్యకర్తలకు నిరూపించారు. లోకేష్ గారితో అనుబంధంగా ఉంటూ సోషల్ మీడియా కార్యకర్తలను ముందుండి నడిపించాడు, వారి మీద పడ్డ కేసులు పై నిరంతరం పార్టీ అధిష్టానంతో సమన్వయం చేస్తూ లాయర్లతో ఆ కేసులు పై పోరాడాడు.
ఇవ్వన్నీ దృష్ట్యా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే తెలంగాణ, బిహార్, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో ఆ నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు సీట్లలో వైసీపీ నుంచి అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే టీడీపీ నుంచి సానా సతీష్ బాబు గార్లు ఎంపీలగా ఉన్నారు వారి పదవీకాలం త్వరలో ముగుస్తుంది. కావున అధికార కూటమికి (టీడీపీ, బీజేపీ, జనసేన) ఈ నాలుగు సీట్లు దక్కనున్నాయి. టీడీపీకి రెండు సీట్లు వస్తాయని, వాటిలో ఒకటి సానా సతీష్‌కు రెన్యూవల్ అవుతుందని తెలుస్తోంది.
మరో సీటు కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చింతకాయల విజయ్, కీలారు రాజేష్ వంటి పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన చింతకాయల విజయ్ గారి పేరు ఈ రేసులో ముందుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
చింతకాయల విజయ్ కి చాలా సానుకూలతలు ఉన్నాయి వాటిలో ప్రథమంగా చూడాల్సింది అనేక బాషల పై తనకు పట్టు ఉండడం ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ విజయ్ అనర్గళంగా మాట్లాడగలడు, అంతేకాకుండా రాజకీయ పరిజ్ఞానం, విషయ పరిజ్ఞానం తనకు బిగ్గెస్ట్ ప్లస్.. ఇవ్వన్ని కాకుండా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతంగా ఆయన్ని రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తోంది. కులాలు, ప్రాంతాలు, సామాజిక సమతుల్యం వంటి అంశాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయి.
నమ్మకస్థుడిగా, కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచిన విజయ్‌కు రాజ్యసభ సీటు దక్కే అవకాశం బలంగా కనిపిస్తోంది!
