Gaddar Film Awards 2026: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్’ విజేతల జాబితా విడుదలైంది. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గానూ జ్యూరీ చైర్మన్ మణిశర్మ నేతృత్వంలో ఎంపిక చేసిన విజేతల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ జాబితాను జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు.
ప్రధాన పురస్కారాలు:
తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ ప్రకటించారు. అలాగే విలక్షణ నటి జయసుధను అక్కినేని నాగేశ్వర రావు (ANR) అవార్డు’తో గౌరవించనున్నారు. కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ అవార్డు, సింగీతం శ్రీనివాసరావుకు బి.ఎన్.రెడ్డి అవార్డు దక్కాయి. అశ్వనీదత్, ఆర్.నారాయణమూర్తి, రమేష్ ప్రసాద్, సుద్దాల అశోక్ తేజ వంటి ప్రముఖులకు కూడా ప్రత్యేక పురస్కారాలు లభించాయి.
సినిమా విభాగంలో విజేతలు:
ఈ ఏడాది ‘తండేల్’ సినిమాకు గానూ నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు రష్మిక మందన్న ఉత్తమ నటిగా నిలిచారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఉత్తమ చిత్రంగా నిలవడమే కాకుండా, ఆ చిత్ర దర్శకుడు సాయిలు ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. మొత్తం 17 విభాగాల్లో ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. సామాజిక సందేశాత్మక చిత్రాలకు ఈసారి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక అవార్డులను కేటాయించడం విశేషం.
గద్దర్ ఫిలిం అవార్డ్స్ – 2025 విజేతల జాబితా:
* ఉత్తమ నటుడు: నాగ చైతన్య (తండేల్)
* ఉత్తమ నటి: రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
* ఉత్తమ చిత్రం: రాజు వెడ్స్ రాంబాయి
* ఉత్తమ దర్శకుడు: సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
* నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా: తండేల్
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: సంక్రాంతికి వస్తున్నాం
* ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం: కోర్టు
* ఉత్తమ సంగీత దర్శకుడు: మార్క్ కె రాబిన్ (దండోరా)
* ఉత్తమ సపోర్టింగ్ నటుడు: శివాజీ
* ఉత్తమ సపోర్టింగ్ నటి: భూమిక
* ఉత్తమ నేపథ్య గాయకుడు: అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
* ఉత్తమ నేపథ్య గాయని: సాహితి చాగంటి (కన్నప్ప)
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
* ఉత్తమ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
* ఉత్తమ హాస్యనటుడు: కృష్ణ తేజ (జిగ్రీస్)
* ఉత్తమ కథా రచయిత: గుణశేఖర్ (యుఫోరియా)
సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అవార్డుల సందడి మొదలవ్వడంతో టాలీవుడ్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక ఘనంగా జరగనుంది.
