Horoscope Today: 2026 మార్చి 5, గురువారం నాడు ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు కొన్ని రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఓర్పుతో వ్యవహరించాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మేష రాశి: (అశ్విని, భరణి, కృత్తిక 1)
మేష రాశి వారికి ఈ రోజు మనసుకి నచ్చిన శుభవార్త అందుతుంది. బంధుమిత్రుల సహకారంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి కనిపిస్తుంది. ధైర్యం కోసం ‘ఆదిత్య హృదయం’ పారాయణం చేయడం ఉత్తమం.
వృషభ రాశి: (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ప్రారంభించిన పనులు విజయవంతంగా ముగుస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదిత్య హృదయ పారాయణం మనోబలాన్ని ఇస్తుంది.
మిథున రాశి:(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి మీకు ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. గోసేవ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటక రాశి: (పునర్వసు 4, puష్యమి, ఆశ్లేష)
చేసే పనుల్లో కొంత శ్రమ ఉన్నప్పటికీ ఫలితం మాత్రం సానుకూలంగా ఉంటుంది. శత్రువుల నుంచి కూడా మీకు అనుకూలత లభిస్తుంది. ముఖ్యమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. వేంకటేశ్వర స్వామి దర్శనం మీకు మేలు చేస్తుంది.
సింహ రాశి: (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఇష్టదేవతా స్తోత్రం పఠించడం శుభప్రదం.
కన్య రాశి: (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి జీవితంలో మీరు ఊహించని అవకాశాలు తలుపు తడతాయి. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన చర్చలు మీకు అనుకూలంగా మారుతాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు అపారమైన ధైర్యాన్ని ఇస్తుంది.
తుల రాశి: (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
మీ భవిష్యత్తుకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ రీత్యా గొప్ప ఫలితాలు సాధిస్తారు. సూర్యారాధన చేయడం వల్ల విజయమార్గాలు సుగమం అవుతాయి.
వృశ్చిక రాశి: (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. రుణ సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవడం మర్చిపోకండి. ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది.
ధనుస్సు రాశి: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ధనుస్సు రాశి వారికి ఇది ఎంతో శుభప్రదమైన సమయం. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం, వస్త్రలాభం సూచనలు ఉన్నాయి. లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. ఈశ్వర శ్లోకాలు చదవడం ఉత్తమం.
మకర రాశి: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో వ్యవహరిస్తే ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టండి. నవగ్రహ ఆరాధన మీకు మంచి మార్గాన్ని చూపిస్తుంది.
కుంభ రాశి: (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కఠోర శ్రమకు తగిన ఫలితం లభించే రోజు. తోటివారి సహాయం మీకు ఎంతో అండగా నిలుస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మీన రాశి: (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో ఆటంకాలు కలిగినా మనోధైర్యంతో ముందుకు సాగండి. అనవసర భయాందోళనలకు లోనుకావద్దు. ఓర్పు చాలా అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
