Indian Hockey: వరుసగా రెండు ఒలింపిక్స్ లో కాంస్యాలు, కీలక మ్యాచుల్లో వీరోచిత పోరాటాలు, గోల్ పోస్టు వద్ద వెటరన్ శ్రీజేశ్ ఉర్రూతలూగించే విన్యాసాలు… ఇవేవీ భారత క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించలేకపోయాయా? సామాన్య జనాల్లో గుర్తింపు లేదా? యువ హాకీ ప్లేయర్ హార్దిక్ సింగ్ అనుభవాన్ని వింటే మనకూ ఇలాంటి సందేహాలు వస్తాయి.
Indian Hockey: వరుసగా రెండు కాంస్య పతకాలతో అదరగొట్టారు మన భారత హాకీ వీరులు. అనేకానేక టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శనతో గత వైభవం దిశగా పరుగులు తీస్తున్న మన భారత జట్టుకు సామాన్యుల్లో ఆదరణ కొరవడిందంటున్నాడు యువ ఆటగాడు హార్దిక్ సింగ్. పారిస్ ఒలింపిక్స్ లో పతకం గెలిచి స్వదేశానికి ఎంతో సంబరంతో వచ్చిన మన హాకీ ఆటగాళ్లకు ఎయిర్ పోర్ట్ లోనే షాక్ తగిలింది. ఎదురేగి స్వాగతాలు పలుకుతారని, ఆటోగ్రాఫ్ ల కోసం చుట్టుముడతారని భావించిన హార్దిక్ సింగ్ తదితర ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ జనమంతా గుమికూడింది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ డాలీ చాయ్ వాలా చుట్టూ. అక్కడి దృశ్యాన్ని చూసిన మన హాకీ వీరులు హతాశులయ్యారు. హాకీ ఆటగాళ్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, స్టార్ ఆటగాడు మన్ దీప్ సింగ్ సహా మేటి ఆటగాళ్లు అయిదుగురున్నా.. జనంలో ఎవరూ వీరిని గుర్తు పట్టలేకపోయారు. తమను పట్టించుకోకుండా డాలీ చాయ్ వాలా తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడుతున్న జనాన్ని చూసి తామంతా ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నామని హార్దిక్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Also Read: రెజ్లర్ వినీష్ ఫోగట్ కు యాంటీ డోపింగ్ ఏజెన్సీ నోటీసు.. ఎందుకంటే..
Indian Hockey: మనదేశంలో క్రికెట్ కు ఉన్న మోజు ముందు హాకీ వెలవెల పోతుండడంలో ఆశ్చర్యం లేదు. కానీ, అంతర్జాతీయంగా మెడల్స్ గెలిచినా పట్టించుకోకపోవడం అనేది మన హాకీ ప్లేయర్స్ ను షాక్ కు గురిచేసింది అని చెప్పడంలో సందేహం లేదు.