Vijay Deverakonda

Vijay Deverakonda: 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకి.. స్కాలర్‌షిప్‌లు ప్రకటించిన దేవరకొండ

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ఆయన భార్య రష్మిక మందన్న సోమవారం తమ స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, బలమూరు మండలం తుమ్మన్‌పేటలో సందడి చేశారు. గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఫామ్ హౌస్‌లో గృహప్రవేశం చేసిన నవ దంపతులు, ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తమ అభిమాన నటుడిని చూసేందుకు గ్రామస్థులు, అభిమానులు భారీగా తరలిరావడంతో తుమ్మన్‌పేటలో పండుగ వాతావరణం నెలకొంది.

ఊరితో విడదీయలేని బంధం

గృహప్రవేశ కార్యక్రమం అనంతరం విజయ్ దేవరకొండ తన గ్రామస్థులతో ముచ్చటిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. “నాకు నా సొంతూరు అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, నా పెళ్లి జరగడం.. ఈ రెండూ ఒకేసారి జరగడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం. ఇకపై ఊరికి రెగ్యులర్‌గా వస్తుంటాను” అని విజయ్ పేర్కొన్నారు.

తమ్ముడు ఆనంద్ పెళ్లిపై క్లారిటీ

తమ కుటుంబంలో జరగబోయే తదుపరి వేడుక గురించి కూడా విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ పెళ్లిని కూడా గ్రామంలోనే, ఊరి వారందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. 

ఊరి అభివృద్ధి కోసం ‘దేవరకొండ ఫౌండేషన్’

కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, తన ఊరికి మరియు నియోజకవర్గానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో విజయ్ పలు సేవా కార్యక్రమాలను ప్రకటించారు. దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అందరం కలిసి మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని గ్రామస్థులకు పిలుపునిచ్చారు.

పోటెత్తిన అభిమాన గణం

విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది అభిమానులు తుమ్మన్‌పేటకు తరలివచ్చారు. దంపతులు ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ అందరినీ పలకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *