Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి శుక్రవారం సాయంత్రం ఒక చేదు వార్త అందింది. ఉదయం వరకు నిలకడగా ఉన్న పసిడి ధరలు, సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరకు అకస్మాత్తుగా బ్రేక్ పడటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు మరియు మార్కెట్ ఒడిదొడుకుల వల్ల కేవలం గంటల వ్యవధిలోనే సీన్ రివర్స్ అయి, ధరలు పైకి కదిలాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 550 పెరిగి ప్రస్తుతం రూ. 1,61,570 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,48,100 వద్ద ట్రేడ్ అవుతోంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,720 గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ. 1,62,550 కు చేరింది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ వాణిజ్య సుంకాల ప్రభావం నేరుగా పసిడి మార్కెట్‌పై పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ గ్లోబల్ మార్పుల వల్లే మన దేశంలో కూడా ధరలు భారీగా మారుతున్నాయి.
బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు మాత్రం ప్రస్తుతానికి స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 2.95 లక్షల వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీలో రూ. 2.85 లక్షలుగా ఉంది. వెండి రేట్లలో పెద్దగా మార్పు లేకపోవడం వెండి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం. అయితే, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు ఇలా పెరగడం పెళ్లి వారు మరియు పెట్టుబడిదారులకు కాస్త ఇబ్బందికరంగా మారింది.
