Horoscope Today: ఫిబ్రవరి 24, మంగళవారం నాడు ఖగోళంలో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకోబోతోంది. కుంభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు కలిసి ‘పంచగ్రహ కూటమి’ గా ఏర్పడనున్నారు. ఈ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారిపై సానుకూల, ప్రతికూల మార్పులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మేష రాశి వారికి ఆర్థిక లాభాలు, మిథున రాశి వారికి అదృష్టం వరించనుండగా, కుంభ రాశి వారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం.
మేషం (Aries): ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట తీరు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం (Taurus): వృత్తిలో సానుకూల మార్పులు వస్తాయి. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం.
మిథునం (Gemini): అదృష్టం మీ వెంటే ఉంటుంది. కెరీర్ మరియు వ్యాపార ఒప్పందాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. లక్ష్యాల పట్ల స్పష్టతతో వ్యవహరిస్తారు.
కర్కాటకం (Cancer): ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు.
సింహం (Leo): అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
కన్య (Virgo): వివాదాలు, కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కొత్త పరిచయాలు ఆర్థికంగా లాభం చేకూరుస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు.
తుల (Libra): సృజనాత్మకత పనుల్లో విజయం సాధిస్తారు. వైద్య మరియు ఫార్మా రంగాల వారికి అత్యంత అనుకూలమైన రోజు. గత అనుభవాలు మీకు పాఠాలుగా మారుతాయి.
వృశ్చికం (Scorpio): ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ధనుస్సు (Sagittarius): ఉద్యోగ బదిలీ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
మకరం (Capricorn): విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీ సౌమ్య ప్రవర్తన వల్ల అందరి మెప్పు పొందుతారు. క్రీడారంగం వారికి శుభ వార్తలు అందుతాయి.
కుంభం (Aquarius): మీ రాశిలోనే గ్రహాల కూటమి ఉన్నందున ఆలోచనల్లో వేగం పెరుగుతుంది. స్థిరాస్తి పెట్టుబడులపై ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సహకారం లభిస్తుంది.
మీనం (Pisces): మార్కెటింగ్ రంగం వారికి అనుకూలం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు పాటించండి. విదేశీ ప్రయాణ ఆటంకాలు తొలగుతాయి.
