Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. తాజాగా అనుదీప్ డైరెక్షన్లో వచ్చిన ‘ఫంకీ’ సినిమా కూడా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. అయితే ఇలాంటి సమయంలో ఓ డిజాస్టర్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చాడు ఈ హీరో. కోలీవుడ్ హీరో కార్తీతో ‘దేవ్’ లాంటి డిజాస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ రజత్ రవిశంకర్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో, సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.
‘దేవ్’ సినిమా దెబ్బకి ఈ డైరెక్టర్ ఏకంగా ఏడు సంవత్సరాలు మాయమైపోయాడు. మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తెలుగులో విశ్వక్ సేన్‌తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్‌తో ‘దేవర’ వంటి సినిమా తీసిన యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యానర్‌లో ‘దేవర-2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రజత్ రవిశంకర్ – విశ్వక్ సేన్ సినిమా పట్టాలెక్కించాలని చూస్తున్నారు. భిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ మూవీలో విశ్వక్ సేన్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తుంది.
మొదటి నుండి ప్రయోగాలు చేస్తున్న విశ్వక్ సేన్‌కు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో క్రేజ్ వచ్చిన వెంటనే, ఎవరూ చేయని రిస్క్ తీసుకుని ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా చేశాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్ కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. తర్వాత ‘హిట్: ఫస్ట్ కేస్’లో పోలీస్ ఆఫీసర్‌గా చేసి హిట్ సిరీస్‌లో తనదైన ముద్ర వేశాడు. లాక్ డౌన్ తర్వాత ‘పాగల్’ లాంటి భిన్నమైన సినిమాతో వచ్చి హిట్ అందుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, దాస్ కా ధమ్కీ, మెకానిక్ రాకీ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా, ఫంకీ వంటి సినిమాలు చేస్తూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నాడు.
