Lokesh Kanagaraj: లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ సినిమా తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ‘DC’ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో వామిఖా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా, సంజన ఏకే ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాలకు మ్యూజిక్ అందించిన అనిరుధ్, ఇప్పుడు హీరో లోకేష్ కనకరాజ్ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం.
టీజర్ గురించి మాట్లాడుకుంటే.. టీజర్ ప్రారంభంలో సంజన క్యారెక్టర్ మైక్ ముందుకు రావడంతో మొదలవుతుంది. తర్వాత వామిఖా గబ్బి, లోకేష్ క్యారెక్టర్లు పరిచయం అవుతాయి. ఏదో అవాంఛనీయ ఘటన జరగడం, వెంటనే కథ రివెంజ్ మోడ్‌లోకి వెళ్లడం టీజర్‌లో చూడవచ్చు. టీజర్‌లో ఒక్క డైలాగ్ లేకపోయినా.. క్యారెక్టర్లు పడుతున్న బాధను, వారు ఉన్న పరిస్థితులను ప్రేక్షకులకు చేరవేయడంలో (Convey) దర్శకుడు విజయం సాధించారు. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుధ్ సింపుల్ మరియు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో ఉన్న విజువల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇక లోకేష్ కనకరాజ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్‌తో తీస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే వెంటనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని లోకేష్ భావిస్తున్నారు. అయితే, ఈ ‘DC’ సినిమా LCU (Lokesh Cinematic Universe) లో భాగమా లేక విడిగా వచ్చే సినిమానా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాతైనా ఖైదీ-2 తీస్తారా లేక ఇంకో సినిమాతో ముందుకు వస్తారా అనేది వేచి చూడాలి.
