Animal Park: ‘యానిమల్ పార్క్’ మరింత బోల్డ్‌గా.. సందీప్ రెడ్డి వంగా ధీమా ప్రకటన!

Animal Park:  ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’తో తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. ‘యానిమల్’ భారీ విజయం తర్వాత ఇప్పుడు దాని సీక్వెల్ ‘యానిమల్ పార్క్’పై ఆయన కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం మరింత బోల్డ్ అండ్ వైల్డ్‌గా ఉంటుందని ఆయన వెల్లడించారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా, విలన్‌గా కనిపిస్తాడట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

‘యానిమల్’ 2023లో రిలీజై ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం రికార్డులు తిరగరాసింది. సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా సాలిడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం జపాన్‌లో రిలీజ్ అవుతుండగా, ప్రమోషన్స్‌లో సందీప్, రణ్‌బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ ‘యానిమల్ పార్క్’ సీక్వెల్ గురించి మాట్లాడారు. 2027లో షూటింగ్ ప్రారంభమవుతుందని, 2028లో రిలీజ్ చేస్తామని ధీమాగా చెప్పారు. ‘స్పిరిట్’ చిత్రం పూర్తి చేసుకున్న తర్వాత దీనిని తీస్తామన్నారు. తొలి భాగంతో పోలిస్తే మరింత బోల్డ్, వైల్డ్‌గా ఉంటుందని తెలిపారు. రణ్‌బీర్ డబుల్ రోల్‌లో, హీరో మరియు విలన్‌గా కనిపిస్తాడని ఆయన వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో హైప్ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *