Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ తేదీ అధికారికంగా ప్రకటించబడింది. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ జోడీ మళ్లీ కలిసి రాబోతున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రాండ్ పోస్టర్‌తో పాటు ఈ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్ మరో సర్‌ప్రైజ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: O Torture Prema: “ఓ టార్చర్ ప్రేమ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల!
పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌తో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి పాట ‘దేఖ్ లేంగే సాలే’కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న రెండో పాట రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. ఈ పాటతో ప్రమోషన్లు మరింత ఊపందుకోనున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, అవినాష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ భారీ కాంబినేషన్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ రికార్డులు కొట్టే అవకాశం ఉంది.
