The Paradise: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో నాని ప్లాన్స్ పూర్తిగా మారిపోయాయి. మార్చి విడుదలకు అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు జూన్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల నాని కొన్ని వారాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ ఆలస్యం ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్టుపై కూడా ప్రభావం చూపింది. ఈ అంశంపై పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Samantha: పెళ్లి తర్వాత పేరు మార్పు నిర్ణయానికి సమంత?
‘ది ప్యారడైజ్’ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్‌లో తీస్తున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ మారిపోయే అవకాశం ఉంది. మార్చి 26కి రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్ 25కి షిఫ్ట్ అవుతుందని సమాచారం. మే నాటికి షూటింగ్ పూర్తి కావచ్చని అంచనా. అయితే ఈ జాప్యం వల్ల నాని ప్లాన్స్ తలకిందులయ్యాయి. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ ఆరు నెలలు వెనక్కి వెళ్లింది. దీని విడుదల 2027 వేసవికి మారే అవకాశం ఉంది. నాని భారీ బ్రేక్ లేకుండా సినిమాలు చేసే వారు కావడంతో ఈ ఆలస్యం ఆయనకు ఇబ్బందికరంగా మారింది.
