Rangareddy: రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు తెల్లవారు జాము సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం జిలా కలక్టరేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్ (28) ఈ తెల్లవారుజామున బాత్రూంలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. కొంత సేపటి తరువాత తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: ప్రియురాలి కోసం బురఖా వేశాడు.. అడ్డంగా బుక్కైపోయాడు!
Rangareddy: మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల. ఇతని ఆత్మహత్య సమయంలో అక్కడ మరో ఇద్దరు ఎఆర్ కానిస్టేబుల్స్ డ్యూటీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ గౌడ్ ఆన్లైన్ గేమ్స్ కు బానిసైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిభట్ల పోలీసులు మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు