Om Shanti Shanti Shantih Review: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా థియేటర్లలో విడుదలైంది. భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత లేని సంబంధాలు, గర్భస్రావం తర్వాత విడాకుల ట్విస్ట్‌తో సాగే ఈ కథ ఆకట్టుకుంటోంది. గోదావరి నేటివిటీ, యాస, భాష సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరుణ్ భాస్కర్ నటన, ఈషా రెబ్బా పాత్ర చిత్రణ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం నటనలు మెప్పించాయి.
Also Read: Keerthi Bhat: బిగ్‌బాస్ కీర్తి భట్ బ్రేకప్‌పై ఎక్స్ లవర్ విజయ్ కార్తీక్ షాకింగ్ వీడియో!
భర్త అహంకారాన్ని అణచివేసే భార్య పాయింట్ ఆఫ్ వ్యూ సన్నివేశాలు బాగున్నాయి. కామెడీ, ఎమోషనల్ సీన్స్ సమతుల్యంగా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో పాటు సగటు భర్త లక్షణాలను అద్భుతంగా ప్రదర్శించాడు. ఈషా రెబ్బా తన నటనతో అలరించింది. బ్రహ్మాజీ సీరియస్ సిచ్యుయేషన్స్‌లోనూ టైమింగ్‌తో మెప్పించాడు. బ్రహ్మానందం, సురభి ప్రభావతి, రోహిణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే దర్శకుడు కథనాన్ని, సెకండాఫ్ స్క్రీన్‌ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉంటే మరింత మెరుగై ఉండేది. కాన్‌ఫ్లిక్ట్‌ను సరిగా ఉపయోగించుకోలేకపోవడంతో సెకండాఫ్‌లో ఇంట్రెస్ట్ కొంత తగ్గింది. మొత్తంగా కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం నిలిచింది.
