Chittoor:

Chittoor: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

Chittoor: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. ఈ ప్ర‌మాదంలో స్కూల్ బ‌స్సును లారీ ఢీకొన్న సంఘ‌ట‌న‌లో ప‌ల‌వురు విద్యార్థుల‌కు గాయాల్యాయి. బ‌లంగా ఢీకొన‌డంతో స్కూల్ బ‌స్సు ముందు బాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్ర‌మాదంలో ఓ విద్యార్థి నాలుక తెగిప‌డ‌టంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

Chittoor: చిత్తూరు జిల్లా ఎస్సార్ పురం స‌మీపంలోని వివిధ గ్రామాల నుంచి విద్యార్థుల‌ను ఎక్కించుకొని జీడీ ఎల్లూరు వైపు స్కూల్ బ‌స్సు వెళ్తుండ‌గా, బీసీ కాల‌నీ వ‌ద్ద ముందుగా వెళ్తున్న స్కూల్ బ‌స్సును వెనుక నుంచి వ‌చ్చిన లారీ బ‌లంగా ఢీకొన్న‌ది. ఏడుగురు విద్యార్థ‌ల‌కు తీవ్ర గాయాలు కాగా, ఒక విద్యార్థి నాలుక తెగిపడింది. క్ష‌త‌గాత్రులైన విద్యార్థుల‌ను చికిత్స కోసం స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో చిత్తూరు, పుత్తూరు ర‌హ‌దారిపై వాహ‌న రాక‌పోక‌లు స్తంభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *