Keerthi Bhat: బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ సీరియల్ నటి కీర్తి భట్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన వార్త బుల్లితెర వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. గత రెండేళ్లుగా నటుడు విజయ్ కార్తీక్‌తో ప్రేమలో ఉండి, నిశ్చితార్థం కూడా చేసుకున్న కీర్తి, ఇటీవల తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. విజయ్ను కేవలం స్నేహితుడిగా మాత్రమే చూడగలనని, భర్తగా ఊహించుకోలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటన తర్వాత నెటిజన్ల నుండి విజయ్‌పై విమర్శలు రావడంతో, ఆయన స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు.
విజయ్ కార్తీక్ తాజాగా విడుదల చేసిన వీడియోలో కీర్తి నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. తాము విడిపోవాలనేది కీర్తి సొంత నిర్ణయమని, తాను ఆమెను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తన ఆర్థిక పరిస్థితి ఇంకా స్థిరపడలేదనే కారణంతో కీర్తి ఈ బంధం నుండి తప్పుకోవాలని భావించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె గత డిసెంబర్లోనే తనకు చెప్పిందని, అప్పటికే ఆమె తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Keerthy Suresh: పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లం: కీర్తి సురేష్
తనకంటే మెరుగైన వ్యక్తి (బెటర్ ఆప్షన్) దొరికాడని, ఆ వ్యక్తితోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కీర్తి తనకు స్పష్టంగా చెప్పిందని విజయ్ వివరించారు. ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతో ప్రయత్నించినప్పటికీ, కీర్తి తన నిర్ణయానికే మొగ్గు చూపిందని ఆయన అన్నారు. కీర్తి నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని, బలవంతంగా ప్రేమను కొనసాగించడం సరైనది కాదని భావించి మౌనంగా ఉండిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. ‘కార్తీక దీపం’ వంటి సీరియళ్లతో ఆదరణ పొందిన కీర్తి భట్ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
View this post on Instagram
