Danam Nagender

Danam Nagender: నాపై ఉన్న అనర్హత పిటిషన్‌ను కొట్టివేయండి.. స్పీకర్‌కు దానం నాగేందర్ విజ్ఞప్తి

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వచ్చిన అనర్హత పిటిషన్‌పై స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన శాసనసభ స్పీకర్‌కు అఫిడవిట్ సమర్పించారు. తాను ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని, పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పార్టీ తనను సస్పెండ్ చేసినట్లు కూడా ఎలాంటి సమాచారం లేదని దానం నాగేందర్ పేర్కొన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లిన మాట వాస్తవమే అని, అయితే అది కేవలం తన వ్యక్తిగత హోదాలోనే వెళ్లానని ఆయన వివరణ ఇచ్చారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని తాను పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్ భావించడం సరికాదన్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం, బీఆర్‌ఎస్ దాఖలు చేసిన ఈ అనర్హత పిటిషన్ చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని ఆయన వాదించారు.

ఈ వివాదానికి సంబంధించి స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటికే స్పందిస్తూ.. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని దానం నాగేందర్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే, అనర్హత పిటిషన్ వేసిన తర్వాత జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకోవద్దని, కేవలం పిటిషన్‌లో ఉన్న అంశాలకే తాను వివరణ ఇస్తున్నానని ఎమ్మెల్యే దానం తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *