Pawan Kalyan

Pawan Kalyan: రూ.40 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించిన పవన్ కళ్యాణ్!

Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన నైతిక విలువలతో అందరినీ ఆకట్టుకున్నారు. పొగాకు కంపెనీ నుంచి వచ్చిన రూ.40 కోట్ల భారీ బ్రాండ్ ఆఫర్‌ను ఆయన వెంటనే తిరస్కరించారు. యువత ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు. డబ్బు కంటే సూత్రాలు ముఖ్యమని చాటిచెప్పిన ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Mrunal Thakur: మృణాల్ తమిళ్ ఎంట్రీ ఫిక్స్!

పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సమాజ హితం కోసం నిలబడతారు. ఇటీవల ఒక ప్రముఖ పొగాకు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయనకు రూ.40 కోట్ల ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ ఆఫర్‌ను ఆలోచించకుండా రిజెక్ట్ చేశారు. యువతను ఆకర్షించే హానికర ఉత్పత్తుల ప్రమోషన్ తనకు ఒప్పదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఆయన అభిమానుల్లో గర్వాన్ని నింపింది. సోషల్ మీడియాలో “డబ్బుతో కొనలేని వ్యక్తిత్వం” అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గతంలోనూ ఇలాంటి ఆఫర్లను తిరస్కరించిన చరిత్ర ఉంది. ఆయన ఈ చర్యతో మరోసారి రియల్ హీరోగా నిరూపించుకున్నారు. ఈ నిర్ణయం యువతకు ఆదర్శంగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *