National News: మన దేశంలో అక్షరాస్యతా రేటులో కేరళ మరోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతం నుంచి అదే స్థానాన్ని ఆ రాష్ట్రం పదిలపర్చుకున్నది. అయితే టాప్-10లో చోటు దక్కించుకున్న రాష్ట్రాల గురించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం రాష్ట్రాల మధ్య అక్షరాస్యతా రేటులో భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. అయితే ఆ టాప్-10 రాష్ట్రాల జాబితాలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు చోటులేకపోవడం గమనార్హం.
National News: మన దేశంలో సగటున పట్టణ ప్రాంతాల్లో 77.7 శాతం, నగరాల్లో 87.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 73.5 శాతం చొప్పున అక్షరాస్యత నమోదైంది. అయితే రాష్ట్రాలవారీగా చూస్తే ఎప్పటిలాగే కేరళ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యతా రేటు నమోదైంది. ఆ రాష్ట్రంలో 96.2 శాతం నమోదైంది. అదే విధంగా వరుసగా మిజోరంలో 91.58, ఢిల్లీలో 88.7 శాతం చొప్పున అక్షరాస్యత రేటు నమోదైంది. ఆ తర్వాత త్రిపుర 87.75 %, ఉత్తరాఖండ్ 87.6 %, గోవా 87.4 %, హిమాచల్ ప్రదేశ్ 86.6 %, అస్సాం 85.9 %, మహారాష్ట్ర 84.8 %, పంజాబ్ 83.7 % చొప్పున అక్షరాస్యతా శాతం నమోదై టాప్-10 రాష్ట్రాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
National News: బీహార్ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యతా శాతం నమోదైంది. ఆ రాష్ట్రంలో అక్షరాస్యతా రేటు 61.8 శాతంగా నమోదైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా టాప్-10 రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ తేడాను తగ్గించి అక్షరాస్యతా శాతాన్ని పెంచుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తగు సూచనలు చేసింది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్షరాస్యతా శాతం పెంపు దిశగా పాలకులు దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచనలు చేస్తున్నారు.
