Esha rebba: టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా తనపై వస్తున్న ప్రేమ, పెళ్లి రూమర్స్‌పై స్పష్టత ఇచ్చింది. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్‌తో డేటింగ్లో ఉందని సోషల్ మీడియా, మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఉన్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈషా, తనపై వస్తున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసింది. ఈ వార్తలు చూసి తన తండ్రి కూడా “పెళ్లెప్పుడు?” అని అడిగారని నవ్వుతూ చెప్పింది.
అయితే, తాను ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని ఆమె అంగీకరించింది. కానీ అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పింది. ఆ వ్యక్తి తరుణ్ భాస్కరేనా కాదా అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
ఈ విధంగా ఈషా రెబ్బా తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.
