Mumbai: ముంబైలో లైంగిక వేధింపుల కేసు కలకలం రేపింది. ‘ధురంధర్’ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు నదీమ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై 10 సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతడి ఇంటి పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడని, అందుకే ఇన్నాళ్లూ బయటకు చెప్పలేకపోయానని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నదీమ్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం, ఆధారాలను సేకరిస్తూ కేసును చట్టపరంగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఘటన బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది.
