Lockdown: అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్!

Lockdown: మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన ‘లాక్‌డౌన్’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. గతేడాది విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం తుపానులు, సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మంచి అంచనాలను పెంచింది.

Also Read: Bollywood: బాలీవుడ్ స్టార్ పై 13 కోట్ల చీటింగ్ కేసు..

ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాక్‌డౌన్’లో అనుపమ పరమేశ్వరన్ ‘అనిత’ పాత్రలో కనిపిస్తుంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఒక యువతి జీవితంలో వచ్చిన క్లిష్ట పరిస్థితులను వాస్తవ సంఘటనల ఆధారంగా చూపించారు. తమిళనాడు తుపానులు, ఇతర కారణాలతో రిలీజ్ ఆలస్యమైంది. లైకా ప్రొడక్షన్స్ ‘ప్రతి విరామానికి ఓ అర్థం ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నాయికా ప్రాధాన్యత ఉన్న ఈ ఎమోషనల్ డ్రామా అనుపమ కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ట్రైలర్ చూసినవారు సినిమాపై భారీ అంచనాలు పెడుతున్నారు. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ పొందే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *