Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి విన్నర్‌గా నిలిచి, వసూళ్లలో దూసుకుపోతున్నది. చిరంజీవి హైయ్యస్ట్ గ్రాస్ సినిమాలను ఒక్కొక్కటిగా పడగొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. ఈ విషయంలో చిరంజీవితోపాటు నిర్మాత, దర్శకుడు, ఇతర చిత్ర బృందమంతా యమ హ్యాపీగా ఉన్నారు.
Megastar Chiranjeevi: ఈ దశలో ఓ పిడుగులాంటి వార్త వచ్చింది. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్‌గారు సినిమా టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన రూ.42 కోట్లను రికవరీ చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జారీ చేసిన మెమో ద్వారా రూ.42 కోట్లను అక్రమంగా ఆర్జించారని, వాటిని రికవరీ చేయాలని కోరుతూ న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రూ.42 కోట్ల వసూళ్ల వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, జీఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Megastar Chiranjeevi: మనశంకర వరప్రసాద్ గారు సినిమా ప్రత్యేక షో టికెట్ ధర రూ.600, వారం రోజులపాటు సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టి ఫ్లెక్స్‌లలో రూ.100 పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీచేశారు. దీనిపై హైకోర్టు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేసింది. కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే న్యాయవాది పాదూరి శ్రీనివాస్‌రెడ్డి కోర్టుకెక్కారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ విచారణను వచ్చే నెల 3వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
