Narendra Modi:

Pm modi: శబరిమల ఆలయ బంగారు చోరిపై విచారణ జరిపిస్తా..

Pm modi: ప్రధానమంత్రి మోదీ కేరళ రాజకీయాల్లో మార్పు అనివార్యమని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని గుర్తుచేస్తూ, అదే తరహాలో కేరళలో కూడా బీజేపీ ఎదుగుదల మొదలైందన్నారు. ఇటీవల Thiruvananthapuram నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటములపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. LDF మరియు UDF రెండూ అవినీతిలో మునిగిపోయాయని, రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆరోపించారు. ఇకపై ప్రజలు మూడో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూడాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి, సుపరిపాలన కోసం బీజేపీనే సరైన ఎంపిక అని ఆయన అన్నారు. రెండు కూటముల జెండాలు వేర్వేరైనా వారి అజెండా ఒకటేనని విమర్శించారు. ప్రజల అభివృద్ధి బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

శబరిమల బంగారం దొంగతనం కేసుపై కూడా మోదీ స్పందించారు. Sabarimala ఆలయంలో జరిగిన బంగారం దొంగతనంపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *