Parliament: ఈ నెల (జనవరి) 28వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒక రోజు ముందుగా అంటే జనవరి 27న అఖిలపక్ష సమావేవం జరుగుతుంది. పార్లమెంటరీ వ్వవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సంయుక్తంగా పాల్గొంటారు. ఆ తర్వాతి రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు షురూ అవుతాయి.
Parliament: తొలుత జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలోనే ఎజెండాను ఖరారు చేయడంతోపాటు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని అన్ని పార్టీలను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కోరనున్నది. ఈ నెల 28న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై.. ఫిబ్రవరి 13న ముగుస్తాయి.
Parliament: పార్లమెంట్ సమావేశాలు తిరిగి మార్చి 9న షురూ అయి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇదే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2026-27 సంవత్సర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సారి ఏఏ వర్గాలకు ఊరట లభించనున్నదో వేచి చూడాలి మరి.
