Sinners: ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ తాజాగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ పొందిన సినిమాలు పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. అయితే ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో వచ్చిన సిన్నర్స్ చిత్రం చరిత్ర సృష్టించింది. 16 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుని ఆల్-టైమ్ రికార్డు సృష్టించింది. మైఖేల్ బి. జోర్డాన్ డ్యుయల్ రోల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Anil Ravipudi: ఈసారి సంక్రాంతికి అనీల్ రావిపూడి పవర్ఫుల్ ఎంట్రీ?
2026 ఆస్కార్ నామినేషన్స్‌లో సిన్నర్స్ సినిమా అద్భుతం సృష్టించింది. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వంలో 2025 ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా సాలిడ్ రెస్పాన్స్ పొందింది. ఇందులో మైఖేల్ బి. జోర్డాన్ డ్యుయల్ రోల్లో నటించాడు. ఇప్పుడు ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటుడు, సహాయ నటుడు, సహాయ నటి, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్‌తో సహా మొత్తం 16 విభాగాల్లో నామినేట్ అయింది. ఇది ఆస్కార్ చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు. గతంలో 14 నామినేషన్స్ రికార్డు ఉండేది. ఇప్పుడు ఈ సినిమా భారీ విజయం సాధించి అకాడమీని ఆకర్షించింది.
