Guntur

Guntur: వివాహేతర సంబంధం అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపించిన భార్య

Guntur: గుంటూరు జిల్లాలో కలకలం రేపిన ఒక విషాద ఘటన గురించి ఇప్పుడు కలకలంగా మరింది. చిలువూరు గ్రామంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, కట్టుకున్న భర్తనే ఒక భార్య అతి కిరాతకంగా చంపేసింది. లోకం శివనాగరాజు అనే ఉల్లిపాయల వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో మొదట అందరూ సహజ మరణమే అనుకున్నారు. కానీ, పోలీసుల విచారణలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. లక్ష్మీ మాధురి అనే మహిళ విజయవాడలో పనిచేస్తున్న సమయంలో గోపి అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. భర్త చేసే వ్యాపారం ఆమెకు నచ్చకపోవడం, అతను తిరిగి హైదరాబాద్ నుండి సొంత ఊరికి రావడంతో తన ప్రియుడితో గడిపేందుకు అడ్డంకిగా మారాడని ఆమె భావించింది.

ఈ క్రమంలోనే భర్తను అడ్డుతొలగించుకోవాలని పక్కా పథకం వేసింది. ఈ నెల 18వ తేదీ రాత్రి భర్త కోసం ఇష్టంగా బిర్యానీ వండి, అందులో ఏకంగా 20 నిద్రమాత్రల పొడిని కలిపి అతనికి పెట్టింది. అది తిని అతను స్పృహ కోల్పోయిన తర్వాత, రాత్రి సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. నిద్రిస్తున్న శివనాగరాజు ఛాతీపై ప్రియుడు గోపి కూర్చోగా, మాధురి దిండుతో అతని ముఖాన్ని అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. భర్త ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ప్రియుడిని పంపేసి, ఏమీ తెలియనట్లుగా తెల్లవార్లూ పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లారాక తన భర్తకు గుండెపోటు వచ్చిందని గ్రామస్థులను నమ్మించే ప్రయత్నం చేసింది.

Also Read: Kerala:కేర‌ళ‌లో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన ఇన్‌ఫ్లుయెన్స‌ర్ షింజితా అరెస్టు

అయితే, అంత్యక్రియలకు సిద్ధమవుతున్న సమయంలో మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. శవం చెవి నుంచి రక్తం రావడాన్ని గమనించి వారికి అనుమానం కలిగింది. దీంతో మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం బయటపడింది. ఊపిరాడకపోవడం వల్లే శివనాగరాజు మరణించాడని, అతని పక్కటెముకలు కూడా విరిగాయని వైద్యులు తేల్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, మాధురి చేసిన పాపం ఒప్పుకుంది. ప్రస్తుతం పోలీసులు మాధురిని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను చంపి, గుండెపోటుగా నాటకమాడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *