మంత్రి పొంగులేటి నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు

హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం కేసులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో గతంలో మంత్రి పొంగులేటి కుమారుడు హర్షా రెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్‌లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఫహెర్దీన్ ముబీన్‌ నుంచి వాచ్‌లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ కేసులో విచారణలో అలోకం నవీన్ కుమార్ రూ.100కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే..ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ.. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి 16 బృందాలుగా వచ్చిన ఈడీ అధికారులు మంత్రి నివాసంతోపాటు ఆయన ఫామ్ హౌస్, బంధువుల ఇళ్లల్లో రైడ్స్ చేపట్టారు.అలాగే ఖమ్మంలోని మంత్రి నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన కంపెనీలతో సహా నగరంలో మొత్తం 5చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంత్రి నివాసంలో ఈడీ అధికారులు భారీగా డబ్బు గుర్తించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *