Elon Musk: ఎయిర్ లైన్స్ సంస్థను కొనాలా వద్దా.. నెటిజెన్లను అడిగిన

Elon musk: టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సోషల్ మీడియా వేదిక X (ట్విటర్) ద్వారా సంచలనం సృష్టించారు. యూరప్‌లో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్ అయిన ర్యాన్ఎయిర్‌ను కొనుగోలు చేయాలా? వద్దా? అంటూ ఆయన యూజర్లతో ఓ పోలింగ్ నిర్వహించారు.

ఈ పరిణామానికి కారణం స్టార్‌లింక్ ఇన్‌ఫ్లైట్ వైఫై అంశంపై మస్క్‌కు, ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ’లియరీకి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం. స్టార్‌లింక్ సేవల ఖర్చు తమకు అనుకూలంగా లేదని ర్యాన్ఎయిర్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. అనంతరం ఓ’లియరీ మస్క్‌ను బహిరంగంగా “ఇడియట్” అని విమర్శించారు. దీనికి ప్రతిగా మస్క్ కూడా అదే స్థాయిలో స్పందిస్తూ ఓ’లియరీని “అట్టర్ ఇడియట్” అని వ్యాఖ్యానించారు.

ఈ మాటల యుద్ధం తర్వాతే మస్క్ ఈ పోలింగ్ పెట్టారు. 7.5 లక్షలకుపైగా ఓట్లు పడగా, 76.8% మంది ర్యాన్ఎయిర్ కొనుగోలుకు మద్దతు తెలిపారు.

తనదైన వ్యంగ్య శైలిలో స్పందించిన మస్క్,
“ర్యాన్ఎయిర్‌ను ‘ర్యాన్’ అనే వ్యక్తే నడపాలి” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

అయితే ఇది నిజమైన టేకోవర్ యోచనా? లేక సరదా పోలా? అన్నదానిపై మస్క్ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *